- నిస్వార్ధబుద్ధి, ధర్మనిరతి, సేవాతత్పరత, జీవాకారుణ్యం ఉన్న మనిషీ ఏ మతానికి చెందినవాడైనా , పూజా పునస్కారాలు చయ్యకపోయినా , దేవుడంటే నమ్మకం లేదని చేప్పినా అతడే భగవంతుడికి ప్రీతి పాత్రుడు.
- నువ్వెంత నిరుపేదవైనా క్షమాగుణం నిన్ను చక్రవర్తిని చేస్తుంది .శత్రువు శరనంటూ వస్తేకరుణించ మానకు .పొందినది చిన్న సహాయమైన ప్రతిఫలం ఇవ్వడం మరువకు , ఇచ్చేదుకు నీ దగర ఏమీ లేకపోతే , ఇస్తానన్నీ మాటైనా ఇవ్యు ఇచ్చిన మాట నీకు కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది .
- ఇతరుల బాధలను తొలగించగలిగిన వాడు ఎవరైనా ఈశ్వరుడే ... ఆయన పలికేది ప్రణవనాదం.
- ఏకాగ్రచితవై భగవంతుని ద్యానింపుము, భగవనామస్మరణ సకల వైకల్యములకు దివ్యాంజనము. ముముక్షుడగు దేహికి దేహవసానాపరియంతము నారాయణ చరణారవిందాసేవయే కర్తవ్యం మొక్షప్రధాతయగు శ్రీహరి సకలభూతంబులకు ఆత్మేశ్వరం సకలచరాచరాసూక్ష్మస్థూల జీవసంగభులయందు అంభోవాయుకుంభీగగనతేజములయందు , పంచమహా భూతములయందు భగవంతుడు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మయను వాచకశబ్దంకల్గి ,దర్శుడును ద్రష్టయు భోగ్యుండును భోక్తుండును నిర్ద్ శించబడి వికల్పితుండైయుండును కావున సర్వభూతంబులందును దయాసహ్రుద్బావంబులు కర్తవ్యములు . దయకల్గిన ఆహాక్షయుండు సంతసించును . హరిసంతసించిన అలభ్యంభేటియుదునులేదు నిమిషభంగు ప్రాణులయిన మనుషులకు మమతాస్పదంభులగు చంచలమైన మిత్రకళత్ర పశుభుత్య బలభందు రాజ్యకోశమణీ మందిర మంత్రి మాతంగా మహిప్రముకవిభవంబులు నిరర్ధకంబులు , యాగప్రముక ఫుణ్యలబ్దంభులైన స్వర్గాదిభోగంబులు పుణ్యానుభవ క్షిణంబులు . కర్మలు కోరక చేయవలెను , కోరిచేసిన దుఃఖములు ప్రాప్తించును , పురుషుడు దేహాంబుకొరకు భోగంబులు అపేక్షించును , దేహంబు నిత్యంబుకాదు తోడరాదు . మృతుండైన దేహంబును శునకములు భక్షించును . మోక్షప్రధాత శ్రీహరి , నారాయణుడే భగవంతుడు .
ఓం నారాయణాయనమః
No comments:
Post a Comment