Monday, November 23, 2020

Telugu Poems with Meaning.

సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ
            రా పురవీధుల గ్రాలగలదె
      మణిమయంబగు భూషణ జాలములనొప్పి
            ఒడ్డోలగంబున నుండగలదె
      అతి మనోహరలగు చతురాంగనల తోడి
            సంగతి వేడ్కలు సలుపగలదె
      కర్పూర చందన కస్తూరి కాదుల
            నింపు సొంపార భోగింపగలదె

గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర
       వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి
       సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె
       జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము

 

ఏనుగునెక్కి ఆపక్క, ఈ పక్క ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ఒంటినిండా వేసుకొని సింహాసనం మీద కూర్చుని హొయలు పోవడం కాదు. పెత్తనం ఉంది గదాని అందగత్తెలను రప్పించుకొని వారితో కులకడం కాదు. తేరగా వచ్చిన సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవించడం గాదు. ఇప్పుడు నీ గతి చూసుకో. అసలు నీకు సిగ్గనేది ఉంటే ఎక్కడన్నా పడి చావు. తొల్లింటి చూఱగలదె (చూఱ అంటే కొల్ల, దోచుకోవడం) – ఇంతకు ముందు లాగా ఇంకా కొల్లగొడదామనుకుంటున్నావేమో – ఇక్కడ నీ జూదపుటెత్తులు పనిజేయవు సుమా. ఇదీ పద్యభావం. నిజానికి పై వివరమంతా చెప్పాల్సిన పని లేదు. పద్యం చదువుతుంటేనే జ్వరతీవ్రతతో శరీరం వేడెక్కుతున్నట్టుగా పఠితకు పద్యభావంతోటి తాదాత్మ్యత ఎక్కిపోతూ వుంటుంది. “జూదమిక్కడ ఆడంగరాదు సుమ్ము” అని ఆఖరు పాదం చెప్పడం, పద్యంలోని నాటకీయతకు ఎంత అందమైన కొసమెరుపు నిచ్చిందో గమనించారు గదా.

 

 

Tuesday, July 24, 2018

Good Words


  • నిస్వార్ధబుద్ధి,  ధర్మనిరతి,  సేవాతత్పరత, జీవాకారుణ్యం  ఉన్న మనిషీ ఏ మతానికి చెందినవాడైనా , పూజా పునస్కారాలు  చయ్యకపోయినా , దేవుడంటే నమ్మకం  లేదని  చేప్పినా  అతడే  భగవంతుడికి   ప్రీతి పాత్రుడు. 
  • నువ్వెంత  నిరుపేదవైనా  క్షమాగుణం  నిన్ను చక్రవర్తిని  చేస్తుంది .శత్రువు శరనంటూ   వస్తేకరుణించ  మానకు .పొందినది చిన్న సహాయమైన ప్రతిఫలం ఇవ్వడం మరువకు ,  ఇచ్చేదుకు  నీ  దగర ఏమీ  లేకపోతే , ఇస్తానన్నీ  మాటైనా  ఇవ్యు  ఇచ్చిన  మాట  నీకు  కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది . 
  • ఇతరుల  బాధలను తొలగించగలిగిన వాడు  ఎవరైనా   ఈశ్వరుడే ... ఆయన  పలికేది ప్రణవనాదం. 
  • ఏకాగ్రచితవై  భగవంతుని  ద్యానింపుము, భగవనామస్మరణ సకల వైకల్యములకు దివ్యాంజనము. ముముక్షుడగు దేహికి దేహవసానాపరియంతము నారాయణ చరణారవిందాసేవయే  కర్తవ్యం మొక్షప్రధాతయగు శ్రీహరి సకలభూతంబులకు  ఆత్మేశ్వరం  సకలచరాచరాసూక్ష్మస్థూల  జీవసంగభులయందు అంభోవాయుకుంభీగగనతేజములయందు , పంచమహా భూతములయందు  భగవంతుడు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మయను వాచకశబ్దంకల్గి ,దర్శుడును ద్రష్టయు భోగ్యుండును భోక్తుండును  నిర్ద్ శించబడి                      వికల్పితుండైయుండును  కావున సర్వభూతంబులందును దయాసహ్రుద్బావంబులు  కర్తవ్యములు . దయకల్గిన ఆహాక్షయుండు సంతసించును  . హరిసంతసించిన అలభ్యంభేటియుదునులేదు  నిమిషభంగు ప్రాణులయిన మనుషులకు మమతాస్పదంభులగు చంచలమైన మిత్రకళత్ర పశుభుత్య  బలభందు రాజ్యకోశమణీ  మందిర మంత్రి మాతంగా మహిప్రముకవిభవంబులు నిరర్ధకంబులు , యాగప్రముక ఫుణ్యలబ్దంభులైన స్వర్గాదిభోగంబులు పుణ్యానుభవ క్షిణంబులు . కర్మలు కోరక చేయవలెను , కోరిచేసిన  దుఃఖములు ప్రాప్తించును , పురుషుడు దేహాంబుకొరకు భోగంబులు అపేక్షించును , దేహంబు నిత్యంబుకాదు తోడరాదు . మృతుండైన  దేహంబును శునకములు భక్షించును . మోక్షప్రధాత శ్రీహరి , నారాయణుడే భగవంతుడు . 
                                                             ఓం నారాయణాయనమః